రమ్ము రమ్ము మా యింటికి

rammu rammu maa yintiki

🎵 TG-519💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

రమ్ము రమ్ము మా యింటికి తండ్రీ రమ్ము రమ్ము ||రమ్ము రమ్ము||

1వ చరణం

జగములగన్న ప్రేమ గర్భుడవు జగములకావల నుందువె నీవు సరగ రమ్ము నీ బిడ్డలగృహమును సందీపనంబు జేయ ||రమ్ము రమ్ము||

2వ చరణం

సంతస ప్రేమాశాంతంబుల నిశా(తంబై యీ గృహ మెల్లప్పుడు సంతత స్వర్గవాసరూపమై సమృద్ధి పొందునటుల ||రమ్ము రమ్ము||

3వ చరణం

అనలజ్వాల సపర్యలు వదలి యనిలపక్ష సంచరణమువదలి అనయము నీ గృహవాసివి నీవై యాశీర్వదించుటుల ||రమ్ము రమ్ము||

4వ చరణం

నీ ఘననామోచ్చరణము చేత నీ గృహమెల్లను పావనమై నీ యాగప్రేమ మర్మంబులు జగతి బాగుగ దెలియునటుల ||రమ్ము రమ్ము||

Report Error