రండి రండి యేసుని యొద్దకు
randi randi yeesuni yoddaku
🎵 TG-1719🌐 Telugu
పల్లవి
రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే యేసుని పిలుపు వినియు నింక – యోచింపరేల అవనిలో అగచాట్ల పాలైన అబ్బదు శాంతి ఆత్మకు నిలలో ||రండి||
1వ చరణం
కరువు రణము మరణము చూచి – కలుగదు మారుమనస్సు ప్రవచనములు సంపూర్ణములాయెను యూదులు తిరిగి వచ్చుచున్నారు ప్రభు యేసు నీ కొరకై తనదు – ప్రాణము నిచ్చె గదా సిలువను రక్తము చిందించియును బలియాయెను యా ఘనుడు మనకై యేసుని నామమునందె పరమ – నివాసము దొరకును ముక్తిని పాప విమోచనమును శక్తిమంతుడు యేసే యిచ్చును నేనే మార్గము నేనే సత్యము – నేనే జీవమును నేను గాకింకెవరు లేరని యెంచి చెప్పిన యేసుని వద్దకు