రండి యేసుని యొద్దకుఁ ప్రియులారా

randi yeesuni yoddakum priyulaaraa

🎵 TG-298💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

రండి యేసుని యొద్దకుఁ ప్రియులారా మీరు రండి యేసుని యొద్దకు రండి రండి రయమున బిలుచుచు నుండెడి రక్షకుఁ డొసఁగెను బ్రాణము ||రండి యేసుని||

1వ చరణం

మీరు పాపంబులఁ ద్యజించి యేసుని కడకు రారే వేగము విశ్వసించి మీరు వచ్చినను మిమ్మును ద్రోయఁడు చేరెడు వారిని జేర్చును దన దరి ||రండి యేసుని||

2వ చరణం

మీకు బ్రతుకేమి శాశ్వతము ప్రియ జనులారా పోకుఁడి యాశించి లోకమును లోకాశలకును లొంగుట చేతను మీకు ఘటిల్లును మెండగు దుఃఖము ||రండి యేసుని||

3వ చరణం

మీరేల జాలము చేసెదరు ప్రియులారా వేగ రారే కడు భాగ్య మొందెదరు చేర వచ్చి చిర జీవము నొందుఁ డ పార ముదంబును బడయఁగ దేవుఁడు ||రండి యేసుని||

Report Error