TG-026
Telugu

రండి యుత్సహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే

randi yutsahinchi paadudamu rakshana durgamu mana prabhuvee

210
views
పల్లవి

రండి యుత్సహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే (2)

1వ చరణం

రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము ||రండి యుత్సహించి||

2వ చరణం

మన ప్రభువే మహాదేవుండు ఘన మాహాత్మ్యముగల రాజు భూమ్య గాధపులోయలును భూధర శిఖరము లాయనవే ||రండి యుత్సహించి||

3వ చరణం

సముద్రము సృష్టించె నాయనదే సత్యుని హస్తమే భువిఁజేసెన్ ఆయన దైవము పాలితుల మాయన మేపెడి గొఱ్ఱెలము ||రండి యుత్సహించి||

4వ చరణం

ఆ ప్రభు సన్నిధి మోఁకరించి ఆయన ముందర మ్రొక్కుదము ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును ||రండి యుత్సహించి||

5వ చరణం

తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుఁగాక ఆదిని నిప్పుడు నెల్లప్పుడు నయినట్లు యుగముల నౌను ఆమేన్ ||రండి యుత్సహించి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.