TG-5691
Telugu

రేగత్వరపడకు ఓర్చుకో

Reegathvarapadaku Oorchukoo

21
views
పల్లవి

1.  రేగత్వరపడకు ఓర్చుకో కోపి గోడుజెందును ఓర్చుకో నీ కన్యాయమయినను కన్ను లెర్రజేయకు శాంత మొందు మెప్పుడు ఓర్చుకో. 2.  ఎవ్వఁడేని తిట్టిన ఓర్చుకో మేలుఁజేయు కీడుకు ఓర్చుకో లోకమందు సుఖము కొంతసేపు నుండును కోపమేలఁ జేతువు? ఓర్చుకో. 3.  నీవు కీడునొందఁగా ఓర్చుకో ప్రతి కీడుఁ జేయకు ఓర్చుకొనియుండుము అంత సరియగును నీకు జయముండును ఓర్చుకో.

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.