TG-5694
Telugu

రేయిపగలు నీ పదసేవే జీవదాయకమే చేయుట మేలు

Reeyipagalu Nee Padaseevee Jeevadaayakamee Cheeyuta Meelu

22
views
పల్లవి

రేయిపగలు నీ పదసేవే - జీవదాయకమే చేయుట మేలు సాటిలేని దేవుడ నీవే - నాదుకోట కొండము నీవే పరమపురిలో దేవా నిరతం - దూత గణములు స్తుతులను సల్పి శుద్దుడు పరిశుద్ధుడనుచు - పూజ నొందే దేవుడ నీవే 1.  జిగటమన్నే మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా సృష్టికర్తను మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా 2.  నరుల నమ్ముటకంటె నిజముగ - నీదు చరణం శరణం దేవా రాజూలను ధరనమ్ముటకంటె - రాజరాజవు నాకాశ్రయము 3.  పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు - పరము జేర్చే పథము నీవే అడుగు జాడలో నడచిన హనోకు - పరముచేరే ప్రాణము తోడ 4.  మృతుల సహితము లేపినావు - మృతిని గెల్చి లేచినావు మృతులనెల్ల లేపేవాడవు - మృత్యువును మృతి జేసితి నీవు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.