రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు
ruchi choochi erigitini yehoovaa uttamudaniyu
రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు (2) రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని (2) ||రుచి చూచి||
గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే (2) తప్పక ఆరాధింతున్ – దయాళుడవు నీవే (2) ||రుచి చూచి||
మహోన్నతుడవగు దేవా – ప్రభావము గలవాడా(2) మనసార పొగడెదను నీ – ఆశ్చర్యకార్యములన్ (2) ||రుచి చూచి||
మంచి తనము గల దేవా – అతి శ్రేష్టుడవు అందరిలో(2) ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) ||రుచి చూచి||
కృతజ్ఞతా చెల్లింతున్ – ప్రతి దాని కొరకు నేను (2) క్రీస్తుని యందే తృప్తి – పొంది హర్షించెదను (2) ||రుచి చూచి||
ప్రార్ధింతును ఎడతెగక – ప్రభు సన్నిధిలో చేరి (2) సంపూర్ణముగ పొందెదను – అడుగువాటన్నిటిని (2) ||రుచి చూచి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
