సా: నా ప్రాణానికి ప్రాణం - నీవే యేసయ్యా
saa: naa praannaaniki praannam - neevee yeesayyaa
సా: నా ప్రాణానికి ప్రాణం - నీవే యేసయ్యా... స్నేహానికి నిజ స్నేహం - నీవే మెసయ్యా.. ప: నా ప్రాణానికి ప్రాణాం నీవేనయ్యా - స్నేహానికి నిజ స్నేహం నీవేనయ్యా నిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్యా..
ప్రాణ స్నేహితులమని బంధువులు స్నేహితులు కన్నీటి సమయములో ఒంటరిని చేసారు (2) ఆస్తులున్న వేళ్ళలో అక్కున చేరారు ఆపద సమయాలలో అంతులేక పోయారు జంటగ నిలచితివి నా ప్రాణమా - కన్నీరు తుడిచితివి నా స్నేహమా కన్నీరు తుడిచితివి (2) ||సా: నా||
నీవే నా ప్రాణమని కడవరకు విడువ నని బాసలన్ని మరచి అనాధగ నన్ను చేసారు నేనున్నానంటు నా చెంతన చేరావు ఎవరు విడచిన నను విడువనన్నావు జంటగ నిలచితివి నా ప్రాణమా - కన్నీరు తుడిచితివి నా స్నేహమా కన్నీరు తుడిచితివి – 2 ||సా: నా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.