TG-356
Telugu

సాక్ష్య మిచ్చెద స్వామి యేసు

saakssya michcheda svaami yeesu

205
views
పల్లవి

సాక్ష్య మిచ్చెద స్వామి యేసు దేవుఁ డంచు సాక్ష్య మనఁగఁ గనిన వినిన సంగతులను దెల్పుటయే సాక్ష్య మిచ్చు కొఱుకు నన్ను స్వామి రక్షించె నంచు ||సాక్ష్య మిచ్చెద||

1వ చరణం

దిక్కు దెసయు లేని నన్ను దేవుఁ డెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మశ్శాంతి నిచ్చినాఁడో ||సాక్ష్య మిచ్చెద||

2వ చరణం

పల్లెటూళ్ల జనుల రక్షణ భారము నాపైని గలదు పిల్లలకును బెద్దల కును బ్రేమతో నా స్వానుభవము ||సాక్ష్య మిచ్చెద||

3వ చరణం

బోధ చేయలేను వాద ములకుఁ బోను నాక దేల నాధుఁ డేసు ప్రభుని గూర్చి నాకుఁ దెలిసినంత వరకు ||సాక్ష్య మిచ్చెద||

4వ చరణం

పాపులకును మిత్రుఁ డంచుఁ బ్రాణ మొసఁగి లేచె నంచుఁ బావముల క్షమించు నంచుఁ బ్రభుని విశ్వసించుఁ డంచు ||సాక్ష్య మిచ్చెద||

5వ చరణం

చోరు లైన జారు లనా చారు లైన నెవ్వరైన ఘోరపాపు లైనఁ క్రీస్తు కూర్మితో రక్షించు నంచు ||సాక్ష్య మిచ్చెద||

6వ చరణం

పరమత దూషణము లేల పరిహసించి పలుకు టేల ఇరుగు పొరుగు వారి కెల్ల యేసు క్రీస్తు దేవఁ డంచు ||సాక్ష్య మిచ్చెద||

7వ చరణం

ఎల్లకాల మూరకుండ నేల యాత్మ శాంతి లేక తల్లడిల్లు వారలకును తండ్రి కుమా రాత్మ పేర ||సాక్ష్య మిచ్చెద||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.