TG-2159
Telugu

సజీవుడవైన యేసయ్యా నిన్నాశ్రయించిన నీ

sajeevudavaina yeesayyaa ninnaashrayinchina nee

54
views
పల్లవి

సజీవుడవైన యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే సముద్రమంత సమృద్ధితో (2) ఆనందించెద నీలో – అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే – ఆనంద ధ్వనులతో ధన రాసులే ఇలా – ధనవంతులకు – ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో – దయచేసినావే – ఇహ పరమున నాకు శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివి శ్రేష్టమైన నీ వాగ్ధానములతో (2) ||సజీవుడవైన||

1వ చరణం

క్షేమము నొందుటయే – సర్వ జనులకు – ప్రయాసగా మారే క్షేమాధారము నీవై – దీర్ఘాయువుతో – సంతృప్తి పరతువు నన్ను నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే నిత్యమైన నీ సత్య వాక్యముతో నలువది ఏండ్లు – నీ స్వాస్థ్యమును – మోసినది నీవే నీ కృప కాంతిలో – నా చేయి విడువక – నడిపించుచున్నది నీవే పరమ రాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే పరిపూర్ణమైన నీ ఉపదేశమును

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.