TG-5733
Telugu

సకలాశీర్వాదముల కారణభూతుడా యేసూ నా ప్రియుడా

Sakalaasheervaadamula Kaaranabhoothudaa Yeesoo Naa Priyudaa

22
views
పల్లవి

సకలాశీర్వాదముల కారణభూతుడా యేసూ నా ప్రియుడా నీ మేలుల తలంచుచుండ స్తుతి గానమే పెదవుల నిండా జయశీలుడా విభుడా పరిపూర్ణుడా హితుడా అన్నపానం లోటు రానీకుండా కార్యము చేసిన పోషకుడా ఆరోగ్యములను కుదుటపరచి ఆయుష్షు పెంచేవాడా జీవమార్గం తప్పిపోనీకుండా జ్ఞానము నేర్పిన ప్రాపకుడా ఆటంకములను అనువుపరచి ఆకాంక్ష తీర్చేవాడా కాయకష్టం పాడు కానీకుండా లాభము కూర్చిన శ్రీకరుడా ఆదాయములను పదిలపరచి ఆధిక్యమిచ్చేవాడా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.