TG-4210
Telugu

సకలము చేయు

Sakalamu Cheyu

0
views
పల్లవి

సకలము చేయు సర్వాధికారి సర్వ జగతికి ఆధారుడా నా హృదిలో వసియింప వచ్చినవాడా (2) ఆరాధ్యుడా నా యేసయ్యా ఆరాధన నీకే (2) ||సకలము||

1వ చరణం

జగద్రక్షకుడా విశ్వవిదాత సర్వ కృపలకు దాతవు నీవే (2) బలియైతివా మా రక్షణకై సర్వ ఘనతలు నీకే ప్రభువా (2) సర్వ ఘనతలు నీకే ప్రభువా ||సకలము||

2వ చరణం

బల శౌర్యము గల యుద్ధ శూరుడవు సైన్యములకు అధిపతి నీవే (2) నా జయములన్ని నీవే ప్రభువా నా ఘనతలన్ని నీకే ప్రభువా (2) నా ఘనతలన్ని నీకే ప్రభువా ||సకలము||

3వ చరణం

కోటి సూర్య కాంతితో వెలుగొందుతున్న మహిమ గలిగిన రారాజువు నీవే (2) చీకటి ఎరుగని రాజ్యము నీది అంతమే లేదు నీ మహిమకు (2) అంతమే లేదు నీ మహిమకు ||సకలము||