సఖుడా దివ్య సఖుడా ప్రియుడా ప్రాణ ప్రియుడా
Sakhudaa Divya Sakhudaa Priyudaa Praana Priyudaa
సఖుడా - దివ్య సఖుడా ప్రియుడా - ప్రాణ ప్రియుడా నీతో అనుబంధము కాదే ఈ నాటిది ఏనాటికీ వీడిపోదు - విభుడా యేసయ్యా ఇన్నినాళ్ల తీపి జ్ఞాపిక - పలికే గీతిక 1. మౌనరాగమే మధురగానమై మరుపురానిదై - మదిలో నిలిచెగా (2) ఊహించని శోధనలే - శృతిలయలు నేర్పినాయి పలుశ్రమలు నడిపినాయి నీ ప్రేమ శిఖరానికి ఏకాంత వేళలో - ఏ కాంతి లేకున్ననూ నా పాదములు జ్ఞారక - కాపాడే యేసయ్యా సద్గుణ రాశివి నీవేనని - స్తుతి మహిమలు చెల్లించెదను నిత్యము నిను కీర్తించెదను ||సఖుడా||
2. నిండు మనస్సులో - ప్రేమ దీపమై మారుమనస్సుకై సత్యమార్గమై (2) పలికే ప్రేమనీవై - నీవు నాతో నున్నావు నా హృదయసీమ నేలే - మహరాజుగా నిలిచావు నీవు నా ముందుగా - నడిచే కాపరిగా నా చేయి వీడకా - నడిపించే యేసయ్యా సద్గుణ రాశివి నీవేనని - స్తుతి మహిమలు చెల్లించెదను నిత్యము నిను కీర్తించెదను ||సఖుడా||
3. రమ్యమైనది - భాగ్యమైనది నిత్యమైనది - సరిపోల్చలేనిది (2) నీ మహిమ రాజ్యమందు సీయోను శిఖరమందు నే పరవశించి పాడే - గొప్ప భాగ్యమిచ్చినావు నూతనమైనది- ఎవరూ పాడలేని శ్రేష్ఠమైన గీతం - నే పాడెద యేసయ్యా సద్గుణ రాశివి నీవేనని - స్తుతి మహిమలు చెల్లించెదను నిత్యము నిను కీర్తించెదను ||సఖుడా||