సమర్థుడవైన దేవా నాకు చాలిన దేవుడా నీవే
Samarthudavaina Deevaa Naaku Chaalina Deevudaa Neevee
సమర్థుడవైన దేవా నాకు చాలిన దేవుడా నీవే సమర్థుడవైన దేవా నా రక్షణకర్తవు నీవే సమర్థుడా యేసయ్య నా సామర్ధ్యం నీవే సమర్థుడా యేసయ్య నా రక్షణ శృంగము నీవే నీటిబుడగ వంటి నా జీవితాన-నీదు ప్రేమతో నన్ను బలపరచితివే చెదరియున్న నా వేదనలో - చేరదీసి నన్ను స్థిరపరచితివే నన్ను బలపరచినవాడా నా బలము నీవే నన్ను స్థిరపరచినవాడా నా సర్వము నీవే ||సమర్థుడవైన||
క్రుంగియున్న నా జీవితాన - కృపనిచ్చి నన్ను ధైర్యపరచితివే ఒంటరైన నా అడుగులలో - తోడైయుండి ఆదరించితివే నన్ను ఓదార్చినవాడా నా ఆదరణ నీవే నన్ను నడిపించిన వాడా నా ధైర్యము నీవే ||సమర్థుడవైన||
సమర్థుడవైన దేవా నాకు చాలిన దేవుడా నీవే సమర్థుడవైన దేవా నా రక్షణకర్తవు నీవే సమర్థుడా యేసయ్య నా సామర్ధ్యం నీవే సమర్థుడా యేసయ్య నా రక్షణ శృంగము నీవే సమర్థుడా యేసయ్య నా మార్గము నీవే సమర్థుడా యేసయ్య నా జీవము నీవే సమర్థుడా యేసయ్య నా ధైర్యము నీవే సమర్థుడా యేసయ్య నా శైలము నీవే సమర్థుడా యేసయ్య నా సారధి నీవే సమర్థుడా యేసయ్య నా అతిశయం నీవే సమర్థుడా యేసయ్య నా ఆనందం నీవే సమర్థుడా యేసయ్య నా ఆరాధన నీకే
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.