TG-4216
Telugu

సమస్త జనులారా

Samastha Janulaaraa

0
views
పల్లవి

సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతిగానము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు (2) ||సమస్త||

1వ చరణం

తానెయొనర్చె మహకార్యములన్ పాపిని రక్షింప బలియాయెన్ (2) శత్రుని రాజ్యము కూలద్రోసెను స్మరియించుడి మీరందరును (2) ఆయనను స్తుతియించుడి ||సమస్త||

2వ చరణం

జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించె నైగుప్తునుండి (2) నలువది వత్సరములు నడిపించె కానానుకు మిమ్ము చేర్చుటకు (2) ఆయనను స్తుతియించుడి ||సమస్త||

3వ చరణం

మోషేకు తన సేవను నొసగె యెహోషువా జయమును పొందె (2) శత్రుని గెల్చి రాజ్యము పొందె ఘనకార్యములను స్మరియించి (2) ఆయనను స్తుతియించుడి ||సమస్త||

4వ చరణం

మీరే ప్రభుని స్వంత ప్రజలుగా కొనె మిమ్ము తన రక్తముతో (2) ఆత్మల చేర్చి సంఘము కట్టె ఆ రీతిని కని స్మరియించు (2) ఆయనను స్తుతియించుడి ||సమస్త||

5వ చరణం

పిలిచెను ప్రభువు సేవకు మిమ్ము నేడే వినుమాయన స్వరము (2) అర్పించుడి మీ జీవితములను సాగిలపడి ఆయన యెదుట (2) ఆయనను స్తుతియించుడి ||సమస్త||