TG-1405
Telugu

సమస్త జనులారా మీరు యెహోవాకు

samastha janulaaraa meeru yehoovaaku

83
views
పల్లవి

సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతిగానము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు (2) ||సమస్త||

1వ చరణం

తానెయొనర్చె మహకార్యములన్ పాపిని రక్షింప బలియాయెన్ (2) శత్రుని రాజ్యము కూలద్రోసెను స్మరియించుడి మీరందరును (2) ఆయనను స్తుతియించుడి ||సమస్త||

2వ చరణం

జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించె నైగుప్తునుండి (2) నలువది వత్సరములు నడిపించె కానానుకు మిమ్ము చేర్చుటకు (2) మోషేకు తన సేవను నొసగె యెహోషువా జయమును పొందె (2) శత్రుని గెల్చి రాజ్యము పొందె ఘనకార్యములను స్మరియించి (2) మీరే ప్రభుని స్వంత ప్రజలుగా కొనె మిమ్ము తన రక్తముతో (2) ఆత్మల చేర్చి సంఘము కట్టె ఆ రీతిని కని స్మరియించు (2) పిలిచెను ప్రభువు సేవకు మిమ్ము నేడే వినుమాయన స్వరము (2) అర్పించుడి మీ జీవితములను సాగిలపడి ఆయన యెదుట (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.