TG-4217
Telugu

సమయమిదే సమయమిదే

Samayamide Samayamide

0
views
పల్లవి

సమయమిదే సమయమిదే సంఘమా సమయమిదే సీయోనులో చేరుటకు సంఘమా సమయమిదే ||సమయమిదే||

1వ చరణం

చూడుము భూమి మీద పాప చీకటి క్రమ్మియున్నది జ్యోతివలె జీవించుము జీవ వాక్యం పట్టుకొని ||సమయమిదే||

2వ చరణం

సీయోనులో వశించు సర్వశక్తుడు నీ ద్వారా శోధింప ఈ దినము మార్పునొందుము స్ఫటికముగా ||సమయమిదే||

3వ చరణం

పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో ప్రేమలోనే నిలువుము నిత్యజీవము చేపట్టుము ||సమయమిదే||

4వ చరణం

సీయోను రారాజు నిన్ను చూచి ఏతెంచెదరు మహిమగల కిరీటము నీకు ఆయన ఇచ్చెదరు ||సమయమిదే||