TG-1320
Telugu

సమయమిదే సమయమిదే సంఘమ సమయమిదే

samayamidee samayamidee sanghama samayamidee

207
views
పల్లవి

సమయమిదే సమయమిదే సంఘమ సమయమిదే సీయోనులో చేరుటకు సంఘమ సమయమిదే

1వ చరణం

చూడుము భూమి మీద పాప చీకటి క్రమ్మియున్నది జ్యోతివలె జీవించు జీవవాక్యము పట్టుకొని ||సమయమిదే||

2వ చరణం

ధూళి దులుపుకొనుము నీ మెడ కట్లు విప్పుకొనుము సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము ||సమయమిదే||

3వ చరణం

నిలువుము సత్యముకై సువార్తకు పోరాడుము సేవను చేసి నీవు త్యాగం చేయుము ప్రాణమును ||సమయమిదే||

4వ చరణం

సీయోను శత్రువులు సిగ్గుపడుదురు నిశ్చయముగా సీయోను నీ పరుగు తుదముట్టించుము త్వరితముగా ||సమయమిదే||

5వ చరణం

సీయోనులో వసించు సర్వశక్తుడు నీ ద్వార శోధింప ఈ దినము మార్పునొందుము స్పటికముగా ||సమయమిదే||

6వ చరణం

పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభుయేసుతో ప్రేమలోనే నిలువుము నిత్యజీవము చేపట్టుము ||సమయమిదే||

7వ చరణం

సీయోను రారాజు నిన్ను చూచి ఏతెంచెదరు మహిమగల కిరీటం నీకు ఆయన ఇచ్చెదరు ||సమయమిదే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.