♪♫
TG-4219
Telugu
సమీపింపరాని తేజస్సులో
Sameepimparaani Thejassulo
0
views
పల్లవి
సమీపింపరాని తేజస్సులో ఓ.. ఓ.. వసీయించువాడ నా దైవమా (2) రాజులకు రారాజా సమస్తమునకు జీవధారకుడా (2) పరిశుద్ధుడా ఆ.. ఆ.. ఆ.. పరిశుద్ధుడా ||సమీపింపరాని||
1వ చరణం
పాపులలో… ప్రధానుడనైన నను రక్షించుటకు క్రీస్తేసువై లోకమునకు అరుదెంచినావు (2) దూషకుడను హానికరుడైన నన్ను (2) కరుణించి మార్చివేసితివి (2) ||సమీపింపరాని||
2వ చరణం
నా దేవా… నా యవ్వనమును బట్టి తృణీకరింప బడకుండ నన్ను కాపాడుము (2) నా పవిత్రత ప్రేమ ప్రవర్తనములో (2) నీ స్వరూపములోకి నను మార్చుము (2) ||సమీపింపరాని||