TG-1643
Telugu

సమీపించరాని తేజస్సులో నీవు వసియించు

sameepincharaani theejassuloo neevu vasiyinchu

59
views
పల్లవి

సమీపించరాని తేజస్సులో నీవు వసియించు వాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింప తరమా (2) యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2) ||సమీపించరాని||

1వ చరణం

ధరయందు నేనుండ చెరయందు పడియుండ కరమందు దాచితివే నన్నే పరమున చేర్చితివే ఖలునకు కరుణను నొసగితివి (2) ||యేసయ్యా||

2వ చరణం

మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచి నా స్థితి మార్చినది నన్నే శ్రుతిగా చేసినది తులువకు విలువను ఇచ్చినది (2) ||యేసయ్యా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.