♪♫
TG-4220
Telugu
సంపూర్ణుడా నా యేసయ్
Sampoornudaa Naa Yesayyaa
0
views
పల్లవి
సంపూర్ణుడా నా యేసయ్యా సర్వ పరిపూర్ణత కలిగిన దేవా (2) నా యందు పరిపూర్ణత కోరితివే (2) నీ జీవ వాక్యమును నాకిచ్చితివే (2) ||సంపూర్ణుడా||
1వ చరణం
ఉపదేశించుటకు నను ఖండించుటకు నీ జీవ వాక్యమును నాకిచ్చితివే (2) నీతి యందు శిక్షణ చేయుటకు తప్పులను దిద్ది నను సరిచేయుటకు (2) నీ జీవ వాక్యమును నాకిచ్చితివే (2) ||సంపూర్ణుడా||
2వ చరణం
ప్రభుని యాత్రలో నే కొనసాగుటకు నీ జీవ వాక్యమును నాకిచ్చితివే (2) నీదు రాకడలో నీవలె ఉండాలని మహిమ శరీరము నే పొందాలని (2) నీ జీవ వాక్యమును నాకిచ్చితివే (2) ||సంపూర్ణుడా||