TG-5729
Telugu

సంబరమే సంతోషమే ఆనందమే ఆర్భాటమే

Sanbaramee Santhooshamee Aanandamee Aarbhaatamee

21
views
పల్లవి

సంబరమే సంతోష మే ఆనంద మే ఆర్భాట మే నా యేసుని జన్మ నాకెంతో పండుగ (2) దివినేలే మహారాజు ఇలలో జన్మించాడీలోకానికి రక్షణ ఇచ్చుట కొరకు సర్వలోకానికి శుభవార్త రారాజు ఇలలో జన్మించాడు క్రిస్మస్ ఆనందము మనకు రక్షకుడేసుకు మహిమా ||సంబరమే||

1వ చరణం

శుభరాత్రి శుభవేళ శుభతార అంబరాన భువిపైన మోక్షమహిమ తేజరిల్లె (2) దూతల స్తోత్రనాదములతో అరుణోదయ దర్శనముగా రక్షకుడు మనకు ఉదయించెను సర్వలోకానికి వెలుగునిచ్చెను ||సర్వలోకానికి||

2వ చరణం

పశువుల తొట్టెలో పవళించె పరమాత్ముడు దీనుడయ్యెను దేవదేవుడు (2) నరుల రక్షణ కొరకూ నరావతారమెత్తెనూ నా దేవుడే దీనుడై దిగివచ్చి సర్వలోకానికి రక్షణిచ్చెను క్రిస్మస్ ఆనందము హల్లెలూయా క్రిస్మస్ ఆర్భాటము హోసన్నా క్రిస్మస్ ఆనందము హల్లెలూయా క్రిస్మస్ ఆర్భాటము స్తోత్రములు ||సంబరమే||

3వ చరణం

మందల కాపరులు మోదమొంది బాలయేసుని గాంచిరి చుక్క నడుప జ్ఞానులొచ్చి కానుకలతో కొలిచి కీర్తించిరి రక్షకుడేసు పుట్టెనంటు పూజిస్తూ ప్రభుని కీర్హించిరి నరులందరికి శుభవార్త అంటూ రక్షకుని కీర్తించిరి ||సర్వలోకానికి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.