సంబరమేనంట శ్రీయేసు జననమంట సంతోషమేనంట యీనాడు ప్రతి ఇంట
Sanbarameenanta Shreeyeesu Jananamanta Santhooshameenanta Yeenaadu Prathi Inta
సంబరమేనంట శ్రీయేసు జననమంట సంతోషమేనంట యీనాడు ప్రతి ఇంట (2) నేడు రక్షకుడు మనకొరకు పుట్టేనంట మన పాపాలు తొలగింప వచ్చేనంట (2) అ.ప: సంబరమేనంట... సంబరమేనంట (2) ||సంబర||
గాబ్రియేలు దూత వచ్చేనంట శుభవార్తను తెచ్చేనంట కన్య మరియమ్మ గర్భమునందు దేవదేవుని జననమంట (2) యోసేపు సందేహపడెనంట మరియను విడనాడ తలచెనంట దూత ప్రత్యక్షమాయెనంట సంగతిని బయలుపరచెనంట (2) సంబరమేనంట... సంబరమేనంట (2) ||సంబర||
రాజైన హేరోదుకు తెలిసేనంట బహుగా కలవరమొందేనంట జ్ఞానులందరిని పిలిచేనంట శిశువు జాడకై పంపేనంట (2) తార దారిని చూపేనంట జ్ఞానులు యేసును దర్శించారంట దేవుని మాటననుసరించారంట వేరొక మార్గమున వెళ్ళారంట (2) సంబరమేనంట... సంబరమేనంట (2) ||సంబర||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.