సందేహమేల సంశయమదేల ప్రభు యేసు గాయములను పరికించి చూడు గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2) ||సందేహమేల||
ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే నీ పాప శిక్షను తానే – భరియించెనే (2) ప్రవహించె రక్త ధార నీ కోసమే కడు ఘోర హింసనొందె నీ కోసమే (2) ||సందేహమేల||
ఎందాక యేసుని నీవు – ఎరగనందువు ఎందాక హృదయము బయట – నిలవమందువు (2) యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2) ||సందేహమేల||
ఈ లోక భోగములను – వీడజాలవా సాతాను బంధకమందు – సంతసింతువా (2) యేసయ్య సహనముతోనే చెలగాటమా ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా (2) ||సందేహమేల||
లోకాన ఎవ్వరు నీకై – మరణించరు నీ శిక్షలను భరియింప – సహియించరు (2) నీ తల్లియైన గాని నిన్ను మరచునే ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా (2) ||సందేహమేల||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.

