TG-4226
Telugu

సన్నుతింతుమో ప్రభో

Sannuthinthumo Prabho

0
views
పల్లవి

సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో (2) కన్న తండ్రి కావుమా (2) కలుషము నెడబాపుమా ||సన్నుతింతుమో||

1వ చరణం

నీతి సూర్య తేజమా జ్యోతి రత్న రాజమా (2) పాతక జన రక్షకా (2) పతిత పావన నామకా ||సన్నుతింతుమో||

2వ చరణం

మానవ సంరక్షకా దీన నిచయ పోషకా (2) దేవా మానవ నందనా (2) దివ్య సుగుణ మందనా ||సన్నుతింతుమో||

3వ చరణం

ప్రేమ తత్వ బోధకా క్షేమ దాత వీవెగా (2) కామిత ఫలదాయక (2) స్వామి యేసు నాయక ||సన్నుతింతుమో||

4వ చరణం

పాప చింతలన్నిటిన్ పారదోలుమో ప్రభో (2) నీ పవిత్ర నామమున్ (2) నిరతము స్మరియించెదన్ ||సన్నుతింతుమో||