TG-453
Telugu

సంపూర్ణ జీవము సంపత్తి నాకు

sanpuurnna jeevamu sanpaththi naaku

212
views
పల్లవి

సంపూర్ణ జీవము సంపత్తి నాకు గాన్ సంతప్త మొందుచు చావును బొందితి నీకై చావును బొందితి నాకేమి చేతువు?

1వ చరణం

నెమ్మయిన రాజ్యము నీ నొందులాగున నా నెత్రు కార్చుచు నా ప్రాణమిచ్చితి నా ప్రాణమిచ్చి ప్రోచితి నాకే మిచ్చితివి? ||సంపూర్ణ జీవము||

2వ చరణం

నా తండ్రి యింటిని నా సింహాసనమున్ నా గౌరవంబును నా వెల్లమానితి నా వెల్లమానివచ్చితి నీవే మిచ్చెదవు? ||సంపూర్ణ జీవము||

3వ చరణం

చెప్పరాని బాధలన్ పొందుచు సిల్వపై చిందితి రక్తము చివ్వున బ్రోవను చింతల నీకై యోర్చితి చింతల నోర్తువా? ||సంపూర్ణ జీవము||

4వ చరణం

నీ క్షమాపణమున్ రక్షణ మార్గమున్ అక్షయభాగ్యమున్ ఆశించి తెచ్చితిన్ నీకై రక్షణ తెచ్చితిన్ నాకేమి యిత్తువు? ||సంపూర్ణ జీవము||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.