సంతోషం నాకు సంతోషం - యేసు నాలో ఉంటే సంతోషం
santhoossam naaku santhoossam - yeesu naaloo untee santhoossam
🎵 TG-1257🌐 Telugu
పల్లవి
సంతోషం నాకు సంతోషం - యేసు నాలో ఉంటే సంతోషం సంతోషం నీకు సంతోషం - యేసు నీలో ఉంటే సంతోషం హల్లేలుయా ఆనందమే - ఎల్లవేళ నాకు సంతోషమే
1వ చరణం
గంతులు వేసి చప్పట్లు కొట్టి దావీదువలె పాడనా... నాకై రక్తాన్ని చిందించి శుద్దునిగాచేసిన యేసంటే నాకు సంతోషం (2) || హల్లేలూయా ||
2వ చరణం
ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయనా... నాకై ఆత్మను ప్రోక్షించి పరలోకం చేర్చిన యేసంటే నాకు సంతోషం (2) || హల్లేలూయా||