సంతోషముతో నిచ్చెడు
Santhoshamutho Nichchedu
సంతోషముతో నిచ్చెడు వారిని నెంతో దేవుడు ప్రేమించెన్ వింతగ వలసిన-దంతయు నొసంగును వినయ మనసుగల విశ్వాసులకును ||సంతోషముతో||
అత్యాసక్తితో నధిక ప్రేమతో నంధకార జను-లందరకు సత్య సువార్తను జాటించుటకై సతతము దిరిగెడు సద్భక్తులకు ||సంతోషముతో||
వేద వాక్యమును వేరు వేరు గ్రా మాదుల నుండెడు బాలురకు సాధులు ప్రభుని సు-బోధలు నేర్పెడి సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు ||సంతోషముతో||
దిక్కెవ్వరు లేకుండెడి దీనుల తక్కువ లన్నిటి దీర్చుటకై నిక్కపు రక్షణ – నిద్ధరలో నలు ప్రక్కలలో బ్రక-టించుట కొరకై ||సంతోషముతో||
ఇయ్యండీ మీ కీయం బడు నని యియ్యంగల ప్రభు యే-సనెను ఇయ్యది మరువక మదిని నుంచుకొని యియ్యవలెను మన యీవుల నికను ||సంతోషముతో||
భక్తి గలిగి ప్రభు పని కిచ్చుఁట బహు యుక్త మటంచు ను-దారతతో శక్తి కొలది మన భుక్తి నుండి యా శక్తితో నిరతము నియ్య వలెను ||సంతోషముతో||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.