TG-4231
Telugu

సంతోషించుడి యందర

Santhoshinchudi Yandaru

0
views
పల్లవి

సంతోషించుడి యందరు నాతో సంతోషించుడి యొక వింతగు కీర్తన బాడ వచ్చితిని సంతోషించుడి నాతో సంతోషించుడి ||సంతోషించుడి||

1వ చరణం

అంధకార మయమైన భూమి నా ద్యంతము వెలిగింప – దాని యా-వేశము దొలఁగింప వందితుండు క్రీస్తేసు నాథుడు – వచ్చె బ్రకాశుండై భూమికి నిచ్చె ప్రకాశంబు ||సంతోషించుడి||

2వ చరణం

కాన నంధకారంబు దొలఁగఁ ప్ర కాశించెను లెండు – మీరు ప్ర-కాశింపను రెండు మానవులను సంతోష పర్చనై – మహిని నవతరించె భక్తుల మనము సంతసించె ||సంతోషించుడి||

3వ చరణం

మిన్ను నుండి సంతోషోదయము మిగుల ప్రకాశించె – హృదయములఁ – దగుల ప్రకాశించె మున్ను జేయబడిన వాగ్ధత్థము – తిన్నగ నెరవేరే భక్తుల కన్ను లాస దీరె ||సంతోషించుడి||

4వ చరణం

ప్రీతియైన నీ పండుగ గూర్చి నూతన కీర్తనను – గలసికొని – నాతో పాడుచును నీ తరి దూరస్థుల-కీ వార్తను – నే తీరును నైనఁ దెలుపఁగ నాతురపడవలెను ||సంతోషించుడి||

5వ చరణం

పాపులపై దేవునికి గలిగిన ప్రబలమైన దయను – లోకమునఁ – జూపింపఁ గవలెను జూపక పోయిన లోపము మనపై – మోపబడును నిజము వేగము జూపుద మా పథము ||సంతోషించుడి||