TG-4233
Telugu

సరి రారెవ్వరు

Sari Raarevvaru

0
views
పల్లవి

సరి రారెవ్వరు – నా ప్రియుడైన యేసయ్యకు (2) సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి (2) ||సరి||

1వ చరణం

నమ్మదగిన వాడే నలు దిశల – నెమ్మది కలుగ చేయువాడే (2) నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే (2) నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే (2) ||సరి||

2వ చరణం

ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే (2) ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే (2) నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే (2) ||సరి||

3వ చరణం

పునరుత్థానుడే జయశీలి మృతిని గెలిచి లేచినాడే (2) శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే (2) నాకై అతి త్వరలో మహిమతో రానైయున్నవాడే (2) ||సరి||