♪♫
TG-1338
Telugu
సరిచేయుమో దేవా నన్ను బలపరచుమో
saricheeyumoo deevaa nannu balaparachumoo
57
views
పల్లవి
సరిచేయుమో దేవా నన్ను బలపరచుమో ప్రభువా (2) నీ ఆత్మతో నను అభిషేకించి సరి చేయుమో దేవా (2) ||సరి||
1వ చరణం
దూరమైతి నీ సన్నిధి విడచి పారిపోతి నీ గాయము రేపి లోకమునే స్నేహించితి నేను పాపము మదిలో నింపుకున్న అది తప్పని తెలిసి తిరిగి వచ్చి నీ సన్నిధిలో నే మోకరించి బ్రతిమాలుచున్నాను నన్ను సరి చేయుమో దేవా నింపుము నీ వాక్యము మదిలో పెంచుము నను నీ పాలనలో శోధనను గెలిచే ప్రతి మార్గం ఇవ్వుము నాకు ప్రతి క్షణము నీ సన్నిధిలో ఒక దినమైనను వేయి దినములకంటే బహుశ్రేష్టము.. అని తెలుసుకున్నాను
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.