♪♫
TG-4234
Telugu
సరిపోదు ఆరాధన
Saripodu Aaraadhana
0
views
పల్లవి
నిరతము నిను స్తుతియించినా దేవా – సరిపోదు ఆరాధన ప్రతి క్షణము కీర్తించినా ప్రభువా – నీ కృపలకు సరితూగునా (2) ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నికే ఆరాధన (2) ||నిరతము||
1వ చరణం
ప్రభువా యెహోవా రాఫా నీవే నా స్వస్థతలు అన్ని నీవే నీవే దేవా యెహోవా నిస్సి నీవే నా విజయాల అధిపతి నీవే నీవే (2) ||ఆరాధన||
2వ చరణం
ప్రేమించే శ్రీమంతుడవు నీవే దేవా కోపానికి కాలయాపన నీదే ప్రభువా నాకున్న ఈ విశ్వాసం నీదే కాదా నీ తోడు ఉంటే నా దరి రాదు ఏ భాధ (2) ||ఆరాధన||
3వ చరణం
నా గతము రద్దు చేసిన నాదు దేవా నా రేపును నడిపించేది నీవే ప్రభువా నీ స్తుతికి ఆలస్యం చేయను నా ప్రభువా నా స్థితిని ఎన్నటికి మరువను నా దేవా (2) ||ఆరాధన||