TG-5740
Telugu

సర్వలోకమునకు సంతోషమే ఇష్టులైనవారికి సమాధానమే

Sarvalookamunaku Santhooshamee Ishtulainavaariki Samaadhaanamee

0
views
పల్లవి

సర్వలోకమునకు సంతోషమే ఇష్టులైనవారికి సమాధానమే (2) సంతోషమే సమాధానమే యేసు జన్మించె లోక కల్యాణమై (2) పాపానికి పరిహారమై ఆదియందు వాక్యం - వాక్యమైన దైవం పుడమిలోన జన్మించెను - నరరూప ధారిగా (2) ఈనాడే క్రొత్తవెలుగు - ఆకాశంలో వెలిగింది ప్రభుయేసు జన్మగూర్చి - తెలిపింది ఆ ధృవతార తారనుగాంచిన జ్ఞానులు - ప్రభునారాధించిరి ||సర్వలోక||

1వ చరణం

మార్గమైన సత్యం - సత్యమైన జీవం త్రిత్వమైన దైవం - ప్రత్యక్షమాయెగా (2) తన ప్రజల పాపమంత - తానే భరియించుట కొరకు దైవానికి వారసులుగా - మానవులను తీర్చుట కొరకు యేసు నామధారుడై - ఇలలో జన్మించెను ||సర్వలోక||