సర్వము సాధ్యము నీతోనే సాధ్యము
Sarvamu Saadhyamu Neethoonee Saadhyamu
సర్వము సాధ్యము నీతోనే సాధ్యము విశ్వాసము తో కొండలను తొలగించు బలమును ప్రసాదించుము – నన్ను బలపరచుము దావీదు లాంటి ధైర్యము – నాకు ఇవ్వుము ప్రతి కాలమున – నిన్ను నమ్ముటకు నా హృదయములో విశ్వాసము నింపుము నేతో నే నిత్యం నడిపించుము ||సర్వము సాధ్యము||
హనోకు లాంటి నడతను నాకు ఇవ్వుము ప్రతి క్షణమునా నీతో నడిపించుము నీకు ప్రియుడనై నేను – బ్రతికెదను నీ సన్నిధిలో నిత్యం – నిలిపించుము ||సర్వము సాధ్యము||
గిదియోను లాంటి విశ్వాసము నాకు ఇవ్వుము బలహీనతలోను నిన్నే నమ్ముటకు అసాధ్యములోను నీ చిత్తము – చేయుటకు జయమంతయు నీకే మహిమ – కలిగించుము ||సర్వము సాధ్యము||
నోహు లాంటి ఆశ్రయము నాకు ఇవ్వుము చూడని దైనా– దానిని నమ్ముటకు లోకములోను నీకే సాక్షిగా నిలిపించుము ప్రతి కాలమున నీకే మహిమ నిరంతరము – ఉండును ||సర్వము సాధ్యము||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.