TG-4244
Telugu

సర్వోన్నత స్థలములలో

Sarvonnatha Sthalamulalo

0
views
పల్లవి

సర్వోన్నత స్థలములలో సమాధానము ప్రాప్తించె ప్రజ కొరకు ప్రభు జన్మముతోను (2) హల్లెలూయా అర్పణలు – ఉల్లముతో చెల్లింతుమ్ రాజాధి రాజునకు – హోసన్నా ప్రభువునకు (2) ||సర్వోన్నత||

1వ చరణం

పశువుల పాకలో మనకు శిశువు జన్మించె పొత్తిగుడ్డలలో చుట్టగ పవళించిన తండ్రి (2) ఆశ్చర్యకరుడు – ఆలోచనకర్త (2) నిత్యుండు సత్యుండు నిజ రక్షణ క్రీస్తు (2) ||హల్లెలూయా||

2వ చరణం

మన వ్యసనములను బాప మొత్తబడుట కొరకై మన సమాధానార్థ శిక్ష మోపబడుట కొరకై (2) మన దోషము బాప – మానవరూపమున (2) జనియించె బాలుండు ఇమ్మానుయేలుండు (2) ||హల్లెలూయా||