TG-3320
Telugu

సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమ

sarvoonnatamaina sthalamulaloona deevuniki mahima

Blessing Kumarవిజయ్ · Vijayపాస్టర్ కరుణ్ కుమార్ · Pastor Karun Kumar
0
views
Chorus

సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమ (2) ఆయనకు ఇష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము (2) సర్వోన్నతుడా ఆరాధన మహోన్నతుడా ఆరాధన (2) ||సర్వోన్నతమైన||

1వ చరణం

ఆత్మసంబంధమైన ఆశీర్వాదములను నాకిచ్చుచున్న సర్వోన్నతుడా (2) అపవాది బలమంతటి పై అధికారమిచ్చియున్నావు (2) అభిషక్తుడా అతి శ్రేష్టుడా అద్భుత కరుడా నీకే ఆరాధన (2) ||సర్వోన్నతమైన||

2వ చరణం

నీ తీర్మానములే నాలో స్థిరపరచుచు తగిన కాలమందు హెచ్చించువాడ (2) నీ రాజ్య ప్రభావములతో నన్ను ఘనపరిచినావే (2) చిరంజీవివే అనంతుడవే సంపూర్ణుడవే నీకే ఆరాధన (2) ||సర్వోన్నతమైన||

3వ చరణం

శత్రు సేనలన్నీ చేతికప్పగించి జయమిచ్చుచున్న జయశాలివే (2) సీయోను రాజ్యములో సదాకాలము నీతో నుండెదను (2) ప్రభాకరా కృపాకరా కరుణాకరా నీకే ఆరాధన (2) ||సర్వోన్నతమైన||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.