సర్వోన్నత స్థలములలో వసియించు దేవుడు
Sarvoonnatha Sthalamulaloo Vasiyinchu Deevudu
సర్వోన్నత స్థలములలో వసియించు దేవుడు సర్వ మానవాళి రక్షణకై భువిని చేరెను (2) అద్భుతమే, ఆశ్చర్యమే ఆయన పుట్టుక సృష్టికారుడే మానవునిగా ఒదిగేను గనుక (2) హోసన్నా హోసన్నా అని ఆయన కీర్తిని చాటారే హల్లెలూయా పాటలు పాడి స్తుతులను చెల్లించరే ||సర్వోన్నత||
అలసిన బ్రతుకులలోన, భారము తొలగించుటకు అలజడి మనసులయందు శాంతిని కురిపించుటకు (2) అరుదెంచెను రారాజు పసిబాలునిగా నిత్యుడైన తండ్రిగా రాజ్యమేలగా ||హోసన్నా హోసన్నా||
ఒంటరి మనుష్యుల కోసం తోడుగా పయనించుటకు లోకము చీకటి తొలగే, వెలుగులనే పంచుటకు (2) ఎన్నటికి వీడిపోని నిజ స్నేహితుడై ఉదయించెను మన కొరకే నీతి సూర్యుడై ||హోసన్నా హోసన్నా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.