TG-3368
Telugu

సర్వోన్నతుడవయ్యా సర్వాధికారివయ్యా

sarvoonnatudavayyaa sarvaadhikaarivayyaa

0
views
Chorus

సర్వోన్నతుడవయ్యా సర్వాధికారివయ్యా (2) నన్ను రూపించితివయ్యా సమస్తము చేసిన దేవా

పల్లవి పూర్వ భాగం

సమస్తము చేసిన దేవా (4)

1వ చరణం

పాపములో నేనుండగా - నా అతిక్రమము నా ఎదుటనుండగా (2) కన్నీటితో నీ ఎదుటనుండగా (2) నన్ను కౌగిలించి కాపాడిన దేవా ||సమస్తము||

2వ చరణం

గర్వముతో నేనుండగా లోకపు కౌగిటిలో నేనుండగా (2) నీ నీతితో నన్ను ఆదరించి (2) నీతిమంతునిగా నన్నుతీర్చిన దేవా ||సమస్తము||

3వ చరణం

మరణచ్చాయలలో నేనుండగా నా మది నెమ్మది లేకుండగా (2) నా కృప నీకు చాలంటివిగా (2) నిత్య నిరీక్షణ ఇచ్చిన దేవా ||సమస్తము||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.