TG-5760
Telugu

సౌందర్యపూర్ణుడా సర్వలోకానాథుడా

Saundaryapoornudaa Sarvalookaanaathudaa

1
views
పల్లవి

సౌందర్యపూర్ణుడా సర్వలోకానాథుడా రమ్యమైన పాలకా గొప్ప రక్షణా కారకా (2) యేసయ్యా నా ప్రాణప్రియుడా - మనస్సంతా నిండిన మధురాను బంధమా అతిప్రియుడా నా ప్రాణేశ్వరా - అపురూపమే నీ ముఖదర్శనం మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశతీరా అతికాంక్షణీయుడా  (2) 1. సద్భక్తితో బ్రతుక ఆశించగా వాగ్ధాన ధ్వనులే బలపరచెను (2) విశ్వాసయాత్ర కడగండ్ల పాలైననూ కన్నీటి కడలి చెలరేగి పొంగిననూ నీవే నిమ్మళపరచినావు ||మనసారా||

1వ చరణం

2. మరిశ్రేష్ఠమైన యీవులను దయచేయ నీ కరుణ చూపి నా కొసగినావు (2) సమృద్ధి జీవము నా కొరకే తెచ్చితివి సమీపించలేని నీ మహిమకై పిలిచిన మహిమోన్నతుడా యేసయ్యా ||మనసారా||

2వ చరణం

3. త్వరలో రానైయున్న నా ప్రియుడవు కను రెప్పపాటున నిను చేరెదను (2) కనులార నిను చూసి మైమరిచిపోయే కనువిందు చేసే మహిమానగరిలో పరవశమే ప్రతినిత్యము ||మనసారా||