సీయోను పాటలు
Seeyonu Paatalu
సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదము (2) లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు (2) పొందవలె నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు (2) ||సీయోను||
ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో (2) నిత్యనివాసము లేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి (2) ||సీయోను||
మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి (2) నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము (2) ||సీయోను||
ఐగుప్తు ఆశలనన్నియు విడిచి రంగుగ యేసుని వెంబడించి (2) పాడైన కోరహు పాపంబుమాని విధేయులై విరాజిల్లుడి (2) ||సీయోను||
ఆనందమయ పరలోకంబు మనది అక్కడనుండి వచ్చునేసు (2) సీయోను గీతము సొంపుగ కలసి పాడెదము ప్రభుయేసుకు జై (2) ||సీయోను||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.