♪♫
TG-067
Telugu
శాశ్వతుడా! విస్మయమొంది నేను నీ
shaashvathudaa! vismayamondi neenu nee
208
views
పల్లవి
శాశ్వతుడా! విస్మయమొంది నేను నీ స్వంతహస్త సృష్టిజూడగా నీ స్వరం విందున్ ఉరుములయందు యేసు ప్రభూ నిన్నారాధింతును ||శాశ్వతుడా! విస్మయమొంది||
1వ చరణం
వృక్షంబులందున్, అడవులలోనే పక్షుల పాటలాలకింతును తక్షణ మగ్రపర్వతంబు నుండి అక్షులతో నీ మహిమ గందున్. ||శాశ్వతుడా! విస్మయమొంది||
2వ చరణం
మహాదేవా! నీయేక పుత్రుండిలన్ నా హేయపాపముల్ భరించి, నా సహాయుడై తా మరణించె నంచు ఓహో! యాశ్చర్యపడి స్మరింతున్. ||శాశ్వతుడా! విస్మయమొంది||
3వ చరణం
క్రీస్తు విజయార్భాటముతో వచ్చి నీ స్థలమందు నన్ను జేర్చగా నే స్థిరతుష్టితో సాష్టాంగపడి నీ స్తుతి జేతునో మహాదేవా. ||శాశ్వతుడా! విస్మయమొంది||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.