TG-4251
Telugu

శాశ్వత కృపన

Shaashwatha Krupanu

0
views
పల్లవి

శాశ్వత కృపను నేను తలంచగా కానుకనైతిని నీ సన్నిధిలో (2) ||శాశ్వత||

1వ చరణం

నా హృదయమెంతో జీవముగల దేవుని దర్శింప ఆనందముతో కేక వేయుచున్నది (2) నా దేహమెంతో నీకై ఆశించే (2) ||శాశ్వత||

2వ చరణం

దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే (2) ధూపార్తిని చేపట్టి చేసెద (2) ||శాశ్వత||

3వ చరణం

భక్తిహీనులతో నివసించుటకంటెను నీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట (2) వేయిదినాల కంటే శ్రేష్టమైనది (2) ||శాశ్వత||

4వ చరణం

సీయోను శిఖరాన సిలువ సితారతో సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడెద (2) సీయోను రారాజువు నీవేగా (2) ||శాశ్వత||

5వ చరణం

నూతనమైన ఈ జీవ మార్గమందున నూతన జీవము ఆత్మాభిషేకమే (2) నూతన సృష్టిగా నన్ను మార్చెను (2) ||శాశ్వత||