TG-4254
Telugu

శాశ్వతమైనది

Shaashwathamainadi

22
views
పల్లవి

శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప అనుక్షణం నను కనుపాపవలె (2) కాచిన కృప ||శాశ్వతమైనది||

1వ చరణం

నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి (2) నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2) ||శాశ్వత||

2వ చరణం

తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2) నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2) ||శాశ్వత||

3వ చరణం

పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2) నా కృప నిను వీడదని అభయమిచ్చితివే (2) ||శాశ్వత||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.