TG-4257
Telugu

శక్తి చేత కాద

Shakthi Chetha Kaadu

22
views
పల్లవి

శక్తి చేత కాదు బలము చేత కాదు దేవుని ఆత్మచే సమస్తము సాధ్యము (2) ||శక్తి||

1వ చరణం

నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని చేసెను దేవుడు శూన్యము నుండి (2) తన రూపులో తన పోలికలో (2) నిర్మించెను దేవుడు నరుని మంటి నుండి (2) ||శక్తి||

2వ చరణం

కౄరమైన సింహాల బోనైననూ విశ్వాసముతో సాగెను దానియేలు (2) అగ్ని గుండములో మరణ శాసనములో (2) ఇమ్మానుయేలు యేసయ్య తోడుగా (2) ||శక్తి||

3వ చరణం

ఘోరమైన పాపాల బానిసైననూ భారమైన బ్రతుకును గడుపుచున్ననూ (2) ప్రియమార నిన్నే పిలువంగ యేసు (2) దరి చేర రావా ఆ ప్రేమ నాథుని (2) ||శక్తి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.