శ్రీ రాజిల్లుచు యేసు క్రీస్తు
shree raajilluchu yeesu kreesthu
శ్రీ రాజిల్లుచు యేసు క్రీస్తు వేంచేసెను భారతిని జయించి ప్రజాళిన్ బ్రోచును! ఆరాజు శాశ్వితుండు భూరిదయాళుఁడు వీరాగ్రేసరుండాజిన్ విజయ ధ్వజంబదె!
ఆ హిమాచలమందు నాటెక్కె మెత్తెను కాహళ ధ్వనియందుఁ గ్రందుకొనెనటన్! సౌహార్థ భావమూని జనాళిన్ బ్రోచుఁగ ఆహా యీ యేసుప్రేమ యాశ్చర్యమైనది! ||శ్రీ రాజిల్లుచు||
ఆంధ్ర కాశ్మీర వంగ ఆ సేతువాసులు ఆంధ్రప్రాయులైయున్న యరణ్యవాసులున్ బంధ విముక్తలౌచుఁ ప్రభువైన యేసుని బంధుర సేవచేయు వారలయ్యెదరు ||శ్రీ రాజిల్లుచు||
వీరెల్లఁ క్రీస్తునందు విశ్వాసముంచిన ఆ రాజు వీరిన్ శాశ్వ తానంద సామ్రాజ్య ధౌరేయులన్ గావించు ఔర! యీ వార్తను స్ఫారానందంబుతోడఁ జాటుదు రెవ్వరు! ||శ్రీ రాజిల్లుచు||
భేరీ తూరారవాది గా రక్షావార్తను దోరంపుఁ గోర్కెఁ జాటు మో దేశ సంఘమా! సౌరభ్యమౌ నీ ప్రేమ సారంబు జూపుము ధీరతన్ యుద్ధమందుఁ బోరాడి గెల్వుము ||శ్రీ రాజిల్లుచు||