శ్రీ రక్షకుండు పుట్టఁగా నాకాశ

shree rakssakundu puttamgaa naakaasha

🎵 TG-129💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

శ్రీ రక్షకుండు పుట్టఁగా నాకాశ సైన్యము ఇహంబున కేతెంచుచు ఈ పాట పాడెను. 'పరంబునందు స్వామికి మహా ప్రభావము ఇహంబునందు శాంతిని వ్యాపింపనీయుఁడు'.

1వ చరణం

ఆ రమ్యమైన గానము ఈ వేళ మ్రోగును సంతుష్టులైన భక్తులు ఆ ధ్వని విందురు ప్రయాసపడు ప్రజల దుఃఖంబు తీరఁగా ఆ శ్రావ్యమైన గానము ఈ వేళ విందురు. ||శ్రీ రక్షకుండు||

2వ చరణం

పూర్వంబు దూతగానము భువిన్ వినంబడి రెండువేల వర్షములు గతించిపోయెను భూప్రజలు విరోధులై యుద్ధంబు లాడి యా మనోజ్ఞమైన గానము నలక్ష్యపెట్టిరి. ||శ్రీ రక్షకుండు||

3వ చరణం

పాపాత్ములారా, వినుఁడి శ్రీ యేసు ప్రభువు మీ పాపభార మంతయు వహింప వచ్చెను తాపత్రయంబు నంతయుఁ దానే వహించును సంపూర్ణ శాంతి సంపద లను గ్రహించును. ||శ్రీ రక్షకుండు||

4వ చరణం

సద్భక్తులు స్తుతించిన ఈ సత్యయుగము ఈ వేళ నే నిజంబుగా సమీప మాయెను ఆ కాలమందు క్షేమము వ్యాపించుచుండెను ఆ దివ్య గాన మందఱు పాడుచు నెప్పుడు. ||శ్రీ రక్షకుండు||

Report Error