శ్రీ యేసు దివ్య నామస్మరణ
shree yeesu divya naamasmaranna
శ్రీ యేసు దివ్య నామస్మరణ చేయవే మనసా పాయక స్మరియించి పరము పొందువే మనసా ||శ్రీ యేసు||
నరుల పాప హరణమునకై నరుడయ్యె మనసా పరమ పుర ద్వారంబు మనకు తెరచెనే మనసా ||శ్రీ యేసు||
నరుల పాప శాప ఫలము నరకమే మనసా ఆ మరణమును తొలంచప్రభువే నుడిసె నేమనసా ||శ్రీ యేసు||
పాపమునకు ప్రాయశ్చిత్తం భవ్యమే గదా ప్రభువే ప్రాయశ్చిత్త బలియై పరగెనే మనసా ||శ్రీ యేసు||
సిలువవేసి ప్రభుని ప్రజలు చంపిరే మనసా ఆ బలుడు తిరిగి లేచి మృతిని గెలిచేనే మనసా ||శ్రీ యేసు||
గెలిచి యేసు హితులమధ్య నిలిచెనే మనసా నిలిచి సమాధాన మంచు పలికెనే మనసా ||శ్రీ యేసు||
పునరుత్థాన మేసు దేవ పుత్రుడని మహా ఘనముగా ప్రకటించుచుండ కాననే మనసా ||శ్రీ యేసు||
తానె మార్గం తానెసత్యం తానెజీవము ఈ ఘన సత్యంబు నమ్మునరులు ధన్యులే మనసా ||శ్రీ యేసు||
నిన్ను నీ వెరింగి ప్రభుని నెరుగ వే మనసా సన్నుతు డందుల కొసంగె సత్యవేదము ||శ్రీ యేసు||
పాపములకు పరితపించి ప్రభుని జేరవే దాపునకు రమ్మంచు కరము చాపేనే మనసా ||శ్రీ యేసు||
ఎంత ఘోరపాపమైన నెంచడే మనసా ఎంత మొత్తమైనను క్షమి యించునే మనసా ||శ్రీ యేసు||
బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించు మనసా ఈ బతుక్నందె ప్రభుని పదము పట్టుకో మనసా ||శ్రీ యేసు||
జనక కుమారాత్మ దేవున్ జపియించు మనసా అనయమును స్మరించు స్వర్గ మద్దియే మనసా ||శ్రీ యేసు||