TG-5726
Telugu

శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు ఇలలోన

Shree Yeesu Mana Koraku Janminchinaadu Ilaloona

0
views
పల్లవి

శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు ఇలలోన సంతోషమే నింపి సంబరమే తెచ్చాడు మనలోన (2) ఆ వెలుగు చూడంగ చాలవంట రెండు కళ్ళు మోకరించి చెబుదాము వేల వేల వందనాలు (2) ఓ అయ్యా యోసేపు సంబరాలు చేద్దాము ఓయమ్మా మెరమ్మో కానుకలు తెచ్చాము (2) ||శ్రీయేసు||

1వ చరణం

పాపాలకు, మన లోపలకు  - ఇఁక చెల్లి పోయింది  కాలము మనలోన చీకటి, తొలగించగా -  నేడు తెచ్చాడు మనకై తన తేజము (2) వేలాది సూర్యులంత వెలుగున్న వాడు వెలలేని మనిషిగా మనలా మెలిగాడు (2) ||శ్రీయేసు||

2వ చరణం

మరణము చెరలను గెలిచేందుకు - ఇచ్చాడు బహుమతిగా తన జీవము తన  సన్నిధిని విడిచిన మనలను - చేర్చేందుకయినాడు తను మార్గము (2) ఏ మంచి లేన్నట్టి మట్టి మనుష్యులను మహిమలో నిలపాలని మహిమ విడిచాడు (2) ||శ్రీయేసు||