TG-529
Telugu

శ్రీ యేసురీతిగాను ప్రేమింపఁ గోరుదున్

shree yeesureethigaanu preeminpam goorudun

207
views
పల్లవి

శ్రీ యేసురీతిగాను ప్రేమింపఁ గోరుదున్ నే నుండఁ గోరుదున్ కోపంబులేనివాఁడు శాంతుండు నాయనే నా స్వామి యొంటిగాను ప్రార్ధించునప్పుడు ఆయన తండ్రితోను మాట్లాడుచుండెను.

1వ చరణం

శ్రీ యేసురీతిగాను నే నుండఁ గోరుదున్ దూషింబఁబడఁగాను దీవించుచుండెను శ్రీ యేసురీతిగాను ప్రేమింపఁ గోరుదున్ నా చెలికాండ్ల మేలు నేఁ గోరు చుందును ||శ్రీ యేసురీతిగాను||

2వ చరణం

శ్రీ యేసురీతి గాను నేనుండఁ గోరుదున్ నావంటి చిన్నవారిన్ ప్రేమించి పిల్చును. శ్రీ యేసురీతిగాను నేనిప్పు డిచ్చటన్ నీ రీతిగాను యేసూ న న్నుండఁ జేయుమీ ||శ్రీ యేసురీతిగాను||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.