శ్రీయేసు రాజ్య ముండును సూర్యుండు
shreeyeesu raajya mundunu suuryundu
శ్రీయేసు రాజ్య ముండును సూర్యుండు వెల్గు చోటెల్ల కల్పాంతకాల మౌదాక ఆ రాజ్యము వ్యాపించును.
నిరంతరంబు ప్రార్థనల్ నిత్య స్తుతుల్ శ్రీయేసుకు తన్నామము ప్రత్యహము సుగంధ మట్లు లేచును. ||శ్రీయేసు రాజ్య||
సమస్త దేశ వాసులు గణింతు రేసు ప్రేమను శ్రీ యేసు పేరు బాలకుల్ బాల్యంబున నుతింతురు. ||శ్రీయేసు రాజ్య||
యేసుని యీవు లొల్కును ఖైదికి సంకెళ్లూడును డాయంగ శాంతి కల్గును సుభాగ్య మబ్బుఁ పేదకున్ ||శ్రీయేసు రాజ్య||
శ్రీ యేసు శక్తి చేతను స్వస్థంబు గల్గు నెల్లెడన్ దచ్ఛక్తి యున్న మేరలన్ నశించు మృత్యు శాపముల్. ||శ్రీయేసు రాజ్య||
మా రాజు కెల్ల సృష్టియున్ విశేష స్తుతుల్ సల్పుతన్ దూతాళి మళ్లి పాడఁగా ఘోషించు భూమియు ఆమేన్ ||శ్రీయేసు రాజ్య||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.